శోకసంద్రంలో శ్రీదేవి సిబ్బంది

28 Feb, 2018 02:00 IST|Sakshi
శ్రీదేవి సిబ్బంది నిర్మల్, మాలైరాజు

తన పిల్లల్ని శ్రీదేవి చదివించారంటున్న పూర్వపు వాచ్‌మన్‌  

ఆఖరిమారు డిసెంబర్‌లో చెన్నైకి రాక

తమిళ సినిమా (చెన్నై): అందాల రాశి శ్రీదేవి ఇక లేరన్న నిజాన్ని అభిమానులే తట్టుకోలేకపోతుంటే.. తమకు జీవనాధారాన్నిస్తున్న వా రి పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉం ది. శ్రీదేవి ముంబైకి మారినా.. ఆమె స్థిరాస్తులు ఇప్పటికీ చెన్నైలో ఉన్నాయి. చెన్నై, వీసీఆర్‌ రోడ్డులో అధునాతనమైన భవనంతో కూడిన ఐదెకరాల స్థలం ఉంది. ఇది షూటిం గ్‌ స్పాట్‌గా కొనసాగుతోంది. స్థానిక ఆల్వార్‌పేట, సీఐటీ కాలనీలో భవనం ఉంది. వీటి నిర్వహణ బాధ్యతను వెంకటపతి అనే ఆయనకు శ్రీదేవి అప్పగించారు. ఆమె హఠాన్మరణ వార్త విన్న వెంకటపతి వెంటనే తన కుటుంబసభ్యులతో ముంబై వెళ్లాడు.

ప్రత్యక్షంగా చూడలేకపోయాను
శ్రీదేవి ఇంట్లో పనిచేస్తున్న రవి అనే వ్యక్తి తాను శ్రీదేవి వీరాభిమానినని, కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన తాను నెల రోజుల కిందటే భార్య పిల్లలతో శ్రీదేవి ఇంట్లో పనిమనిషిగా చేరామని చెప్పాడు. శ్రీదేవిని దగ్గరగా చూడవచ్చనుకున్నానని ఇప్పుడా ఆశ ఆవిరైపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

నా పిల్లల్ని చదివించారు
శ్రీదేవి ఇంటికి వాచ్‌మన్‌గా ఏడేళ్లు పనిచేసిన మాలైరాజు మాట్లాడుతూ.. శ్రీదేవి తమతో చాలా బాగా మాట్లాడేవారని, ఆమెది చాలా మంచి మనసు అని అన్నాడు. తమ పిల్లల్ని ఆమె చదివించారని, శ్రీదేవి సహాయంతోనే తన పెద్ద కొడుకు ఇప్పుడు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడని చెప్పాడు.

డిసెంబర్‌లో చివరిసారిగా చెన్నైకి..
గత ఏడాది నవంబర్‌ 8న శ్రీదేవి కుటుంబ సభ్యులతో  చెన్నైకి వచ్చి 4 రోజులుండి తన భర్త పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నా రని ప్రస్తుత వాచ్‌మన్‌ నిర్మల్‌ చెప్పాడు. ఆ తరువాత డిసెంబర్‌ 3న చివరిసారిగా శ్రీదేవి ఒక్కరే వచ్చారని చెప్పాడు.

మరిన్ని వార్తలు