సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్కు ఎదురు దెబ్బ

14 Jan, 2015 10:47 IST|Sakshi
సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్కు ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణజింకలను వేటాడిన కేసులో రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థాపం పక్కన పెట్టింది. సల్మాన్ ఖాన్ విదేశాలకు వెళ్లవచ్చని రాజస్తాన్ హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పునర్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా రాజస్తాన్ హైకోర్టును ఆదేశించింది.

కాగా ఈ కేసులో సల్మాన్కు విధించిన శిక్ష అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. 2006లో ఈ కేసులో సల్మాన్ఖాన్కు శిక్ష పడింది. హైకోర్టు గత సంవత్సరం నవంబర్ 12న ఆ శిక్షపై స్టే విధించింది.

మరిన్ని వార్తలు