‘ప్రభుత్వంపై ఇప్పుడే విమర్శలు తగదు’

16 Aug, 2019 18:10 IST|Sakshi

శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370, 35A రద్దు అనంతరం జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులెలా ఉన్నాయనే అంశంఫై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. త్వరలోనే జమ్ముకశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొంటుందని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని టైమ్స్‌ ఎడిటర్‌ అనురాధా బాసిన్‌ సుప్రీంలో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అక్కడ సమాచార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆమె వాపోయారు. దీనిపై అడ్వకేట్‌ వ్రిందా గ్రోవర్‌ సమాధానమిస్తూ..  సమాచార లోపం కారణంగానే శ్రీనగర్‌కు బదులుగా జమ్ములో పత్రికలు ప‍్రచురితమవుతున్నాయని తెలిపారు. 

జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లోపం లేదని అటార్నీజనరల్‌ వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వంపై ఇప్పుడే విమర్శలు చేయడం తగదన్నారు. కశ్మీర్‌ అంశం పట్ల ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడానికి కోర్టుకు కొంత సమయం కావాలని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌​ గగొయ్‌ స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. శుక్రవారం వెలువడిన కొన్ని వార్తా పత్రికలు జమ్మూకశ్మీర్‌లో ల్యాండ్‌లైన్‌, ఇంటర్‌నెట్‌ కనెక్షన్ల సేవలు పునరుద్ధరించినట్టు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు