గడువు పొడిగిస్తే అది అందరికీ వర్తిస్తుంది

12 Apr, 2017 01:37 IST|Sakshi

పాతనోట్ల మార్పిడిపై సుప్రీంకోర్టు  
న్యూఢిల్లీ: రద్దయిన పాత నోట్లను మార్చుకునే అవకాశం మళ్లీ కల్పిస్తే, అది ప్రజలందరికీ వర్తించేలా ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రత్యేకించిన ఆర్‌బీఐ శాఖల్లో మార్చి 31 వరకు పాత నోట్లు మార్చుకోవచ్చని స్వయంగా ప్రధాని మోదీ, ఆర్‌బీఐలు చెప్పినప్పటికీ, పాత నోట్లను తీసుకునేందుకు గడువుకు ముందే నిరాకరించారంటూ సుధ మిశ్రా అనే మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ కేసుకు సంబంధించి మార్చి 6నే కోర్టు కేంద్రం, ఆర్‌బీఐలకు నోటీసులు పంపింది. నోట్లరద్దుకు సంబంధించి వచ్చిన పలు ఇతర పిటిషన్లను కూడా కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.

మరిన్ని వార్తలు