నెటిజన్‌ వ్యంగ్యం.. ‘చిన్నమ్మ’ కౌంటర్‌

30 Mar, 2019 14:31 IST|Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా వేదికగా ‘మై భీ చౌకీదార్‌’ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు సహా అమిత్‌షా సహా కేంద్ర మంత్రులు,  పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు తమ ట్విటర్‌ ఖాతాల పేర్లకు ‘చౌకీదార్‌’పదాన్ని జతచేర్చారు. ‘నేను కాపాలాదారునే (మై భీ చౌకీదార్‌)’ అనే అర్థం ఉన్న ఈ పదంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా విపక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీ చౌకీదార్‌ క్యాంపెయిన్‌పై నెటిజన్లు కూడా తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇందులో భాగంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్‌.. ‘ మేడమ్‌ మీరు మా దేశ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి అని అనుకుంటున్నాను. బీజేపీలో మీరొక్కరే కాస్త మంచి మనసున్న వ్యక్తి. మిమ్మల్ని మీరు చౌకీదార్‌ అని ఎందుకు అనుకుంటున్నారు’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఇందుకు స్పందించిన సుష్మ.. ‘ అలా ఎందుకు చేశానంటే.. భారతీయుల, ప్రవాస భారతీయుల సమస్యలు తీర్చే కాపలాదారీ పని చేస్తున్నాను కదా. అందుకు మై భీ చౌకీదార్‌’ అంటూ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా