టీ, సమోసాలకు రూ. 9 కోట్లు

1 Sep, 2016 01:44 IST|Sakshi
టీ, సమోసాలకు రూ. 9 కోట్లు

లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రులు తమ అతిథులు, అధికారులకు టీ, సమోసా, గులాబ్ జామూన్ వంటి అల్పాహారం ఇవ్వడానికి నాలుగేళ్లలో రూ.9 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్న ప్రజాధనంతో వారీ పనిచేశారు. విషయాన్ని సీఎం అఖిలేష్ శాసనసభలో చెప్పారు. 2012 మార్చి 15న అఖిలేష్ అధికార పగ్గాలు చేపట్టగా 2016 మార్చి 15 నాటికి అతిథులకు ఇచ్చిన అల్పాహారానికి రూ.8,78,12,474 ఖర్చయిందన్నారు. అల్పాహారం కోసం రూ.21 లక్షలకు పైగా వెచ్చించిన మంత్రులు ఆరుగురు. సహాయ మంత్రి  అరుణ్ కోరి అత్యధికంగా రూ.22,93,800 ఖర్చు చేశారు.

మరిన్ని వార్తలు