ఏడాదికి 40వేలమంది బాలికల అక్రమ రవాణా

29 Jul, 2016 12:59 IST|Sakshi
ఏడాదికి 40వేలమంది బాలికల అక్రమ రవాణా

న్యూఢిల్లీ: భారతదేశంలో బాలికల అక్రమ రవాణాపట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2014 లో వెల్లడైన ఓ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ఏడాదికి 40 వేలమంది బాలికల అక్రమ రవాణా జరుగుతోంది. వీరిలో 11వేలమంది జాడ కనిపించకుండా పోతున్నారు.

ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక బాలిక కనిపించకుండా పోతుందని తమ వద్ద నివేదికలు ఉన్నాయని, ఈ సమస్యను పట్టించుకోకుంటే తీవ్రంగా మారుతుందని హక్కుల కమిషన్ హెచ్చిరించింది. ఇలా అక్రమ రవాణా చేసిన వారిని భిక్షాటనకు, వేశ్యా గృహాలకు తరలిస్తున్నారని, క్లబ్బుల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగేళ్ల బాలికల నుంచి ఆ పైడిన వారి వరకు ఎవరినీ వదలకుండా అక్రమ రవాణా చేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఈ సమస్యను పట్టించుకోవాలని సూచించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా