మోదీతో మాణిక్ సర్కార్ భేటీ

16 Jun, 2015 16:36 IST|Sakshi
మోదీతో మాణిక్ సర్కార్ భేటీ

న్యూఢిల్లీ: త్రిపురకు ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాలు అందించాలని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయానికి వచ్చిన మాణిక్ సర్కార్ అరగంటకుపైగా మోదీతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు అందించే ప్రత్యేక నిధులలో ఎలాంటి కోతలు విధించవద్దని, అలాంటి చర్యలు తమ రాష్ట్రాలపాటిట శాపంగా మారుతాయని వివరించారు.

ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఏడు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రాన్ని అభ్యర్థించాలని నిర్ణయించినట్లు మాణిక్ తెలియజేశారని పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. ఎన్డీఏ సర్కారు ఈశాన్య రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్నదని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ కనీసం అపాంయింట్ మెంట్ కూడా ఇవ్వడంలేదని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగాయ్ సోమవారం వ్యాఖ్యనించిన నేపథ్యంలో ప్రధానితో త్రిపుర ముఖ్యమంత్రి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు