బిహార్ పోరు హోరా హోరీ

8 Nov, 2015 09:40 IST|Sakshi
బిహార్ పోరు హోరా హోరీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కానీ ఇది ఓ మహా యజ్ఞం లాంటిది. ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం 243 అసెంబ్లీ నియోజవర్గాల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలైంది. రెండు కూటముల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. నువ్వా.. నేనా అన్నట్లుగా ఆధిక్యాలు మారుతున్నాయి. లెక్కింపు మొదలైన తొలి గంటలో ఎన్డీయే కూటమి ముందంజలో ఉండగా.. తర్వాత మళ్లీ మహాకూటమి కొన్నిచోట్ల పుంజుకుంది. తాజాగా అందిన వివరాల ప్రకారం ఎన్డీయే కూటమి 91 చోట్ల, మహాకూటమి 99 చోట్ల, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మొత్తం 62,780 ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. 14,580 మంది అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు. పట్నాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 3,450 మంది అభ్యర్థులు పోటీపడిన ఈ ఎన్నికల్లో మొత్తం 272 మంది మహిళలు కూడా పోటీలో ఉన్నారు. వీళ్లలో ఎంతమంది అసెంబ్లీకి వెళ్తారో.. ఎందరు ఇళ్లకు పరిమితం అవుతారో మధ్యాహ్నానికల్లా తేలిపోతుంది. అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమైన ఐదు దశల ఎన్నికలు... నవంబర్ ఐదో తేదీతో ముగిశాయి.

మరిన్ని వార్తలు