భారతీయులకు ఫేస్‌బుక్ ఉంటే చాలు!

7 Jul, 2016 18:29 IST|Sakshi
భారతీయులకు ఫేస్‌బుక్ ఉంటే చాలు!

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌లు వచ్చిన తర్వాత మనిషి ఇతరులతో సంబంధాలు తెంచేసుకుంటున్నాడు. బయట ఎక్కడైన మనిషి కనిపిస్తే పలకరింపు ఉంటుందో.. లేదో.. కానీ సోషల్ మీడియా సైట్లు ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో హాయ్ ఎలాగున్నావు, లాంటి పలకరింపులు ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. ప్రయాణం చేస్తున్నప్పుడు చేతిలో స్మార్ట్‌ఫోన్, అందులో ఇంటర్ నెట్ ఉంటే ఇంకా ఏం అక్కర్లేదు ఇప్పుడు. ప్రయాణం చేస్తున్న సమయంలో భారతీయులు ఇతర సోషల్ మీడియాల కన్నా ఫేస్‌బుక్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రకృతి అందాలను ఆస్వాదించటం కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారు. ప్రయాణంలో దాదాపు సగం సమయం ఫేస్‌బుక్‌కే కేటాయిస్తున్నారు. ఇటీవల ఓ సర్వేలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. 40 శాతం మంది యూజర్లు తమ ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ ఛాటింగ్ చేస్తున్నారు, 27 శాతం మంది పర్యాటక ప్రాంతాలను వెతుకుతున్నారు. 23 శాతం మంది ప్రముఖ రెస్టారెంటులను సెర్చ్ చేస్తున్నారు. 31 దేశాలకు చెందిన 9,200 మందిపై ట్రావెలింగ్ సంస్థకు చెందిన వెబ్‌సైట్ హోటల్.కామ్ ఈ అధ్యయనం చేసి మనకు మనదేశ ఫేస్ బుక్ యూజర్ల విధానాన్ని వెల్లడించింది.

మరిన్ని వార్తలు