గాంధీజీ ‘హేరామ్‌’ అనడం నేను విన్లేదు

31 Jan, 2018 01:46 IST|Sakshi

చెన్నై: నాథూరాం గాడ్సే తుపాకీ తూటాకు నేలకొరిగిన మహాత్మా గాంధీ చివరిసారిగా ‘హేరామ్‌’ అన్నారో లేదో తనకు తెలియదని గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు వెంకిట కళ్యాణం (96) చెప్పారు. తుదిశ్వాస విడవడానికి కొన్ని క్షణాల ముందు గాంధీ ‘హేరామ్‌’ అనలేదని కళ్యాణం దశాబ్దం క్రితం చెప్పడంతో అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై ఇన్నాళ్లకు కళ్యాణం స్పష్టతనిచ్చారు.

‘‘గాంధీజీ ‘హేరామ్‌’ అనలేదని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ‘హేరామ్‌’ అనడం నేను విన్లేదు అని చెప్పా. ఆయన హేరామ్‌ అని అన్నారేమో.. నాకు తెలియదు. గాంధీజీపై కాల్పులు జరిగిన ఆ క్షణాన అక్కడంతా గందరగోళంగా ఉంది. అక్కడున్నవారంతా అరుస్తున్నారు. నాకసలేం వినిపించలేదు’’ అని ఆయన అన్నారు. 1943 నుంచి గాంధీజీ చనిపోయేదాకా ఆయనకు సహాయకుడిగా పనిచేశారు.  

మరిన్ని వార్తలు