కేంద్రానికి షాకిచ్చిన అలీఘడ్‌ యూనివర్సిటీ..!

22 Sep, 2018 19:23 IST|Sakshi

సర్జికల్‌ దాడుల దినోత్సవం మేం జరుపుకోం

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాల్లో జరుపుకోండి :ఎఎమ్‌యూ విద్యార్థులు

లక్నో: దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబర్‌ 29వ తేదీన ‘సర్జికల్‌ దాడుల దినోత్సవం’ను జరపాల్సిందిగా ఆదేశిస్తూ ‘యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌’ తాజాగా జారీ చేసిన సర్కులర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  దీనిపై యూపీలో అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఎఎమ్‌యూ) విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సర్జికల్‌ దాడుల దినోత్సవంను తాము వ్యతిరేకిస్తున్నామని ఎమ్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మషుష్కర్‌ అహ్మద్‌ ఉస్మానీ తెలిపారు.

భారత సైన్యం దాడులు చేయడం ఇదే తొలిసారి కాదని... ఇంతకు ముందు కూడా అనేక సందర్భల్లో దాడులు నిర్వహించారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వాలు ఇలా ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ఆయన పేర్కోన్నారు. దేశభక్తిని చాటిచెప్పేందుకు ప్రతీ ఏడాది ఆగస్ట్‌ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని.. ఇప్పుడు ఈ దినోత్సవాలు ఎందుకని ఉస్మానీ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం సర్జికల్‌ దాడుల దినోత్సవం జరుపుకోవాలి అనుకుంటే, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాల్లో నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని అన్నారు. కాగా యూనివర్శిటీలతో ఎలాంటి సంప్రతింపులు లేకుండానే యూజీసీ ఏకపక్షంగా జారీ చేసిన ఈ సర్కులర్‌ను విద్యార్థులు, అధ్యాపకులు పలువురు తప్పుపడుతున్నారు.

మరిన్ని వార్తలు