ఆ బాంబులో సీమాంధ్ర కోసమేనా?

1 May, 2014 20:21 IST|Sakshi
ఆ బాంబులు సీమాంధ్ర కోసమేనా?

గురువారం చెన్నైలో పేలిన బాంబులు నిజానికి ఆంధ్రప్రదేశ్ లో పేల్చాలని ఉగ్రవాదులు పథకం వేశారా? ఆ బాంబులను ఆంధ్రప్రదేశ్ లోకి తరలిస్తున్నారా? అవుననే అంటున్నారు ఉగ్రవాద వ్యవహారాల నిపుణులు.

ఎందుకంటే సీమాంధ్ర తప్ప మొత్తం దక్షిణ భారతదేశంలో ఎన్నికలు అయిపోయాయి. ఈ బాంబులు పేలిక కంపార్ట్ మెంట్లలోని ప్రయాణికులు అందరూ కోస్తా ప్రాంతానికి వెళ్తున్న వారే. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు వీటిని ఉద్దేశించి ఉండవచ్చునని హోం శాఖ కు చెందిన ఒక నిపుణుడు పేర్కొన్నారు.

రైలు చెన్నైకి దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది. సమాయినికి రైలు ప్రయాణించి ఉంటే బాంబు పేలే సమయానికి అది కోస్తా ప్రాంతంలో ఉండి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. అయితే బాంబులను టైమర్ ద్వారా పేల్చి ఉండవచ్చునని చెబుతున్నారు. మరో వైపు బాంబు పేలుళ్ల నేపథ్యంలో రైలులోనే ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చెన్నై రైల్వే స్టేషన్ లో కానీ, తమిళనాడులో రైళ్లలో కానీ పేలుళ్లు జరగడం ఇదే తొలిసారి. తమిళనాట ఇంతకుముందు ఒకే బాంబు పేలుడు సంఘటన జరిగింది. అంది 1998 లో కోయంబత్తూరులో ఒకే సారి 12 చోట్ల బాంబులు పేలి, 60 మంది చనిపోయారు. దాదాపు 200 మంది గాయపడ్డారు. ఆ తరువాత జరిగిన సంఘటన ఇదే.

మరిన్ని వార్తలు