'నా కొడుకుది తప్పని తేలితే పాలిటిక్స్ కు గుడ్ బై'

27 Aug, 2014 14:32 IST|Sakshi
'నా కొడుకుది తప్పని తేలితే పాలిటిక్స్ కు గుడ్ బై'
న్యూఢిల్లీ: నా కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు అని కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉంటే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల గురించి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించానని రాజ్ నాథ్ తెలిపారు.
 
రాజ్ నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఓ ప్రకటనలో తెలిపింది. పంకజ్ సింగ్ వచ్చిన ఆరోపణలన్ని అవాస్తవాలు. రాజకీయ దురుద్దేశంతో చేసినవని పీఎంవో తెలిపింది. 
 
అవినీతి, చెడు ప్రవర్తన కారణంగానే నరేంద్రమోడీ బీజేపీ టికెట్ ను నిరాకరించారనే వార్తలు ఇటీవల రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నోయిడా టికెట్ ను పంకజ్ సింగ్ ఇవ్వడానికి మోడీ నిరాకరించారనే వార్తలు గతంలో వెలువడిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు