అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన యూపీ సీఎం

7 Jun, 2019 17:36 IST|Sakshi

లక్నో : అయోధ్యలోని సోథ్ సంస్థాన్ మ్యూజియంలో ఏడడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నాడు ఆవిష్కరించారు. కర్ణాటకలో తయారు చేసిన ఈ విగ్రహాన్ని అయోధ్య తీసుకు వచ్చి ఆవిష్కరించారు. రూ. 35 లక్షలు ఖరీదు చేసే ఈ విగ్రహాన్ని కర్ణాటక రాష్ట్ర ఆర్ట్‌, క్రాఫ్ట్‌ ఎంపోరియం నుంచి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కొనుగోలు చేసింది.

విగ్రహావిష్కరణ అనంతరం యోగి మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది కొన్ని పెద్ద విషయాలు చోటు చేసుకున్నాయి. సాధువుల ఆశీర్వాదంతో మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నియ్యారు. వారందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మోదీ భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప శక్తిగా మారుస్తారు. భారతదేశ ప్రజలు రాజకీయాల్లో ప్రతికూలతను తిరస్కరించారు. దేశం సురక్షితంగా ఉంటేనే.. మతం కూడా భద్రంగా ఉంటుంది. అయోధ్యలో ఎంతో అభివృద్ధి జరిగింది. జాతి సమగ్రతను కాపాడ్డమే మన ముఖ్య ధ్యేయం.అయోధ్యలో రామ మందిర నిర్మాణమే ఈ దేశ ప్రజల చిరకాల కోరిక’ అన్నారు.

మరిన్ని వార్తలు