అమెరికాలో మార్మోగుతున్న ప్రజా విజయం పాట

18 Aug, 2019 12:41 IST|Sakshi

డల్లాస్‌ నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

వాషింగ్టన్‌: అమెరికా పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఆగస్టు 17 సాయంత్రం 6 గంటలకు డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయిన ఆయన అక్కడికి విచ్చేసిన నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం డల్లాస్‌ నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో అమెరికాలో తెలుగువాళ్ల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

ఎన్నికల్లో విజయం తరువాత సీఎం హోదాలో తొలిసారి అమెరికా పర్యటనకు వచ్చిన జననేతకు అడుగుడుగున ఘనస్వాగతం పలుకుతున్నారు.  జై జగన్ నినాదాలతో అభిమానులుల హోరెత్తిస్తున్నారు. వైఎస్ జగన్‌ ప్రజా విజయంపై రాసిన పాట అమెరికాలో మారుమోగుతోంది. తెలుగోళ్లను ఉర్రూతలూగిస్తోంది. జగన్‌ రాక సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా తొలిసారి డల్లాస్‌కు వచ్చిన వైఎస్‌ జగన్‌కు అక్కడి ప్రజలు ఘన స్వాగతం​ పలికిన విషయం తెలిసిందే. అంతకుముందు డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు. అందరూ తమ తమ గ్రామాల అభివృద్ధికోసం సహకరించాలని కోరారు. 

చదవండి: పెట్టుబడులకు రండి..అండగా ఉంటాం : సీఎం జగన్‌

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా