న్యూజిలాండ్‌లో ఘనంగా బోనాల వేడుకలు

5 Aug, 2019 17:22 IST|Sakshi

అమ్మవారికి వెండి బోనం సమర్పణ

ఆక్లాండ్: బోనాల పండుగ వేడుకలను దేశ విదేశాల్లో ఉ‍న్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మన బోనం మరోసారి అమ్మవారికి భక్తితో సమర్పించబడింది. ఆషాడ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరంలో ప్రసిద్ధ శ్రీ గణేష దేవాలయంలో బోనాల పండుగ వేడుకలను నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి శ్రీ చంద్రు అమ్మవారిని వివిధ కూరగాయలు, పండ్లతో శాకంబరి రూపంలో అలంకరించి, శ్రీ గణేష హోమం మొదలుకొని వివిధ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి సమర్పించిన బోనాలకు ఆయన ప్రత్యేక పూజలుచేసి ప్రపంచ శాంతి, ప్రజలందరి సంక్షేమం కొరకు ప్రార్థించారు. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు.

కన్నుల పండుగగా సాగిన కార్యక్రమంలో ఉమారామారావు రాచకొండ దంపతులు అమ్మవారికి వెండి బోనం సమర్పించారు. భక్తులు బోనాలతోపాటు, చీరలు, సారే, ఒడి బియ్యం అమ్మవారికి భక్తి పారవశ్యంతో సమర్పించారు. రామమోహన్ దంతాల, ఇతర ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించిన ఈ కార్యకమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు పాల్గొన్నారు. రమా వెంకటనరసింహా రావు, సునీత జగన్ మోహన్ రెడ్డి వడ్నాల, లక్ష్మీ కళ్యాణ్‌రావు కాసుగంటి, శ్రీదేవి కృష్ణ పూసర్ల, లతా జగదీశ్వర్ రెడ్డి మగతల, వర్ష రాహుల్ ఆరేపల్లి, భవాని రవి బోనాలు సమర్పించారు. అభిలాష్వి జేత, యాచమనేని అనూరాధ, కీర్తన, శ్రీ రష్మి, అశుతోష్, సునీత, విజయ్‌ కృష్ణ, నరేందర్ రెడ్డి, వినోద్ ఎరబెల్లి, ఇంద్ర సిరిగిరి, శ్రీధర్‌ రెడ్డి, కిరణ్ పోకలతో పాటు భక్తులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు 
 

మరిన్ని వార్తలు