ఖతార్‌లో ప్రవాసులకు బీమా సౌకర్యం

27 Dec, 2019 12:24 IST|Sakshi
బీమాకు సంబంధించిన ఎంఓయూ కుదుర్చుకుంటున్న ప్రతినిధులు

125 రియాల్స్‌ చెల్లిస్తే.. లక్ష రియాల్స్‌ బీమా

గల్ఫ్‌ డెస్క్‌: ఖతార్‌ దేశంలో ఉంటున్న ప్రవాస భారతీయులకు నూతన సంవత్సర కానుకగా బీమా సౌకర్యం కల్పించారు. ఈ మేరకు ఈ నెల 24న ఖతార్‌లోని భారత రాయబారి పి.కుమరన్‌ బీమా పథకాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఐసీబీఎఫ్, దమాన్‌ ఇస్లామిక్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల మధ్య ఎంఓయూపై ఐసీబీఎఫ్‌ ప్రసిడెంట్‌ పీఎన్‌ బాబురాజన్, దమాన్‌ సీవోవో హరికృష్ణన్‌ సంతకాలు చేశారు. ఖతార్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన వారికి బీమా పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఒక్కసారి 125 ఖతార్‌ రియాల్స్‌ చెల్లిస్తే రెండేళ్ల పాటు లక్ష రియాల్స్‌ బీమా పొందవచ్చు. సహజ మరణాలకు కూడా బీమా వర్తిస్తుంది. గాయాలపాలైనా, జీవితకాలం కోలుకోలేకపోయే విధంగా క్షతగాత్రులైన వారికి కూడా ఇన్సూరెన్సు ద్వారా పరిహారం అందుతుంది. వివరాలకు తెలంగాణ గల్ఫ్‌ సమితిని సంప్రదించాలని సంస్థ ప్రతినిధులు సూచించారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు