బస్టాండ్‌లలో దోపిడీ!

10 Feb, 2015 00:52 IST|Sakshi

రాష్ర్టం మొత్తం మీద ఏ ఆర్టీసీ బస్టాండ్లు చూసినా అపరిశుభ్రతే! ఎంత ఘోరం అంటే కనీస సదుపాయాలు కూడా లేవు. మంచినీటి దగ్గర నుంచి మూత్రశాలల వరకూ అన్నీ అరకొరే. ఇక లోపల తినుబండారాల దుకాణాలు అయితే చెప్పనక్కరలేదు. ఏ మాత్రం శుచిగా లేకున్నా ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకోవడం ప్రయాణికు లను నిలువునా దోచుకోవడం అక్కడ దుకాణదారులకు పరిపా టైపోయింది. ఏ అధికారికి చెప్పినా ఫలితం శూన్యం.

ఇది మామూలైపోయింది. ఎవరూ ఏమీచేయలేని పరి స్థితి దాపురించింది. ఒకానొక సందర్భంలో సంబం ధిత మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు మంత్రి గారికే పరాభవం ఎదురైందంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఎంతో ఘనంగా చెప్పుకునే హైద రాబాద్ ఇమ్లిబన్ బస్టాండ్ పరిస్థితి కూడా అంతే! అదే కాదు హైదరాబాద్‌లో అన్ని ఆర్టీసీ బస్టాండ్‌ల పరిస్థితి అంతే, ఒక్కసారైనా ఏ ఒక్క అధికారి అడిగిన పాపాన పోలేదు, ఇక మురుగు, పారి శుధ్యం సంగతి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. కాబట్టి ఇప్పటికైనా మన అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవల సిన అవసరం ఎంతైనా ఉంది.

- ఎస్.రాజేశ్వరి  చిక్కడపల్లి, హైదరాబాద్

మరిన్ని వార్తలు