‘చేయెత్తి జైకొట్టి’న తొలితరం ప్రజాగళం!

22 Sep, 2015 01:14 IST|Sakshi
‘చేయెత్తి జైకొట్టి’న తొలితరం ప్రజాగళం!

చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా!... అంటూ తెలుగునాట ఉర్రూతలూగించిన ఈ చైతన్య గీతికను అలనాటి కమ్యూనిస్టు ప్రముఖుడు వేములపల్లి శ్రీకృష్ణ రాయగా.. ఆ గేయం బహుళ ప్రచారం పొందడానికి కారకులు బి. గోపాలం. ఆరు దశాబ్దాల పాటు ప్రజోద్యమాల సైదోడుగా నిలిచిన తొలితరం ప్రజాగాయకుడు గోపాలం 1927లో ఇప్పటి నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరులో బొడ్డు రామదాసు, మంగమ్మ దంపతు లకు జన్మించారు.
 
 హరికథలు చెప్పే తండ్రి తాను పాడే పాటలు, పద్యాల పట్ల గోపాలంలోని ఆసక్తిని గమనించి విజయవాడలోని ప్రముఖ వయొలిన్ విద్యాంసులు వారణాసి బ్రహ్మయ్యశాస్త్రి వద్ద సంగీ త శిక్షణకు చేర్పించారు. తర్వాత దుగ్గిరాలకు చెందిన కొండపనేని బలరామయ్య ప్రోత్సాహంతో గుంటూ రు జిల్లా ప్రజానాట్యమండలిలో చేరారు. వేముల పల్లి శ్రీకృష్ణ రచించిన ‘చేయెత్తి జైకొట్టు తెలు గోడా!’, పులుపుల శివయ్య రాసిన ‘పలనాడు వెల లేని మాగాణిరా’ గేయాలను అనేక సభల్లో వయొలి న్‌తో గోపాలం పాడుతుంటే ప్రజలు ఉర్రూతలూగే వారు. నాటి సభల్లో గోపాలం పాట, షేక్ నాజర్ బుర్రకథ తప్పక ఉండేవి.
 నాజర్ తన తంబుర వాయిద్యం తో బుర్రకథను కొత్తమలుపు తిప్పగా.. గోపాలం సామాజిక చైతన్యం కలిగిన అనేక పాటలకు నవ్యరీతిలో బాణీలు కట్టేవారు.  1943లో విజయవాడలో అఖిల భారత రైతు మహాసభలో ఫిడే లు వాయిస్తూ.. ‘స్టాలినో నీ ఎర్ర సైన్యం’ పాటలో సోవియెట్ యూని యన్ మూకలను ఎలా చెండాడిందో ఉద్రేకంతో పాట పాడి లక్ష మంది ప్రేక్షకుల ప్రశంశ లందుకున్నారు గోపాలం.
 
 1948 నుంచి విజయ వాడ ఆకాశవాణిలో ఎంకి-నాయుడుబావ, భక్త రామదాసు, దేవులపల్లి కృష్ణశాస్త్రి ధనుర్దాసు, విశ్వ నాథ సత్యనారాయణ సంగీత రూపకాలు.. ఇంకా అనేక గేయాలు పాడారు. ఆ సమయంలో రేణుక అనే గాయనితో ఏర్పడిన పరిచయం వివాహానికి దారితీసింది. వారిది కులాంతర వివాహం.
 
 ప్రముఖ సినీదర్శకులు తాతినేని ప్రకాశరావు ఆహ్వానం మేరకు గోపాలం 1951 డిసెంబర్‌లో ఇప్పటి చెన్నైకు వెళ్లారు. మధురగాయకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు వద్ద సహాయకునిగా చేరి పల్లెటూరు, బతు కుదెరువు, పరోపకారం సినిమాలకు పనిచేశారు. పల్లెటూరు సినిమాలో ఎన్టీ రామారావుపై చిత్రీకరించిన ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ గేయా న్ని ఘంటసాల.. గోపాలం కట్టిన ట్యూన్‌తోనే పాడడం విశేషం! సి.నాగ భూషణం రక్తకన్నీరు, బికారిరాముడు నాటకాలకు సంగీతం సమకూర్చారు.
 
 నలదమయం తి, బికారిరాముడు, మునసబుగారి అల్లుడు, రౌడీ రంగడు, పెద్దలు మారాలి, విముక్తి కోసం తదితర 30 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు సంగీత దర్శ కత్వం వహించారు. సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వర రావుతో ‘రంగులరాట్నం, బంగారు పంజరం’, జోస ఫ్‌తో కలిసి ‘కరుణామయుడు’ సినిమాలకు పనిచే శారు. రంగులరాట్నంలో ‘నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో’, కరుణామయుడు లోని ‘దావీదు తనయా హోసన్నా’ ‘ కదిలింది కరు ణ రథం’, బికారి రాముడులో ‘నిదురమ్మా’ రామాం జనేయ యుద్ధంలో ‘రామనీల మేఘశ్యామ’ తదితర పాటలకు గోపాలం కట్టిన బాణీలు నేటికీ అఖిలాం ధ్ర ప్రేక్షకులను అలరించడం విశేషం. అందాలనటులు శోభన్‌బాబు, హరనాథ్, చలం, కన్నడ రాజ్‌కుమార్ తదితరులకు ప్లేబ్యాక్ పాడారు.
 
 కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్ వెం పటి చినసత్యం కలిసి విదేశాల్లోనూ ప్రోగ్రాములు ఇచ్చారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, పి.సుశీల, వాణీజయరాం, బొంబాయి సోదరీమణులు పాడిన అనేక భక్తిగీతాల క్యాసెట్లకు సంగీతం సమకూర్చారు. వం దేమాతరం శ్రీనివాస్ సంగీత మెలకువలు నేర్చుకు న్నది గోపాలం వద్దే. 1995లో చెన్నై నుంచి వచ్చిన తరువాత గోపాలం అనుబంధం మంగళగిరితో పెన వేసుకుంది. చిరునవ్వే ఆభరణంగా చరమాంకాన్ని గడిపిన గోపాలం 2004 సెప్టెంబర్ 22న కాలధర్మం చెందారు. పలు సామాజిక చైతన్య గీతాలతో అశేష జనవాహిని హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదిం చిన తొలి తరం ప్రజాగళం బి.గోపాలం.
- (నేడు ప్రజాగాయకుడు, సినీ సంగీత దర్శకుడు బి.గోపాలం 11వ వర్ధంతి )  
 అవ్వారు శ్రీనివాసరావు  మంగళగిరి

మరిన్ని వార్తలు