గ్రహం అనుగ్రహం

9 Jan, 2015 03:40 IST|Sakshi
గ్రహం అనుగ్రహం

 శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి బ.చవితి సా.4.18 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం మఖ సా.5.50 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం ఉ.4.33 నుంచి 6.20 వరకు
 తిరిగి రా.2.44 నుంచి 4.30 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.50 నుంచి 9.41 వరకు
 తదుపరి ప.12.28 నుంచి 1.18 వరకు
 అమృతఘడియలు ప.3.12 నుంచి 4.58 వరకు
 
 సూర్యోదయం    :    6.37
 సూర్యాస్తమయం    :    5.37
 రాహుకాలం    :    ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం    :    ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
 
మేషం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు పనిభారం.
 
వృషభం: ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు.
 
మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
 
కన్య:
బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
 
తుల
: బంధువులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
 
వృశ్చికం: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
ధనుస్సు
: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 
మకరం:
మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు మార్పులు.
 
కుంభం
: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.
 
మీనం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
 
- సింహంభట్ల సుబ్బారావు

 
 

>
మరిన్ని వార్తలు