మత మార్పిడి పరిష్కారమా!

30 Dec, 2014 02:18 IST|Sakshi

మన దేశంలో ప్రస్తుతం జరగాల్సినవి స్థితి మార్పిడులే కానీ మత మార్పిడులు కావు. దేశంలో నేడు నెలకొన్న పరిస్థితుల్లో అత్యవసరంగా జరగాల్సినవి పేదల ఆర్థికస్థితి మార్పిడులు. దేశ జనాభాలో మూడొంతుల మంది దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. రైతులు తగ్గి, రైతు కూలీ లు పెరిగిన వైనం వ్యవసాయ రంగ సంక్షోభానికి నిదర్శనం. ఈ పరిస్థి తిని మార్చేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. అయితే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వ్యవహారాలు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఉదాసీనత తోనో, పరోక్ష మద్దతుతోనో మతమార్పిడులు చోటుచేసుకుంటున్నా యి.
 
  మతం అన్నది వ్యక్తిగత వ్యవహారం. దాన్ని అలానే ఉండనివ్వాలి. రాజ్యాంగ నిబంధన 25(1) ‘ఎవరైనా తమ మతాన్ని అనుసరించమని ఇతరుల్ని ఒప్పించవచ్చు గానీ భయపెట్టో, లేనిపోని ఆశలు కల్పించడం ద్వారానో బలవంతపెట్టడం చేయరాదని’ చెప్తోంది. 1977లో సుప్రీం కోర్టు కేరళ మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని సమర్థిస్తూ అదేమాట చెప్పిం ది. అలాంటి కార్యక్రమాల ద్వారా సామాజిక ఆందోళన తలెత్తే పరిస్థితి ఉత్పన్నమైతే ప్రభుత్వం చర్య తీసుకోవచ్చని తెలిపింది. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారాల్లో వేలుపెట్టడం లేనిపోని సమస్యలు సృష్టిం చే అవకాశమున్నందున, ప్రభుత్వం ఆదిలోనే నివారించాలి.
- డా.డి.వి.జి.శంకరరావు
 మాజీ ఎంపీ,పార్వతీపురం, విజయనగరం, జిల్లా

మరిన్ని వార్తలు