బుచ్చిబాబు శతజయంతి సభ

13 Jun, 2016 00:46 IST|Sakshi

ఈవెంట్


 బుచ్చిబాబు శతజయంతి సభ, జూన్ 14న సాయంత్రం 6 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు భార్య శివరాజు సుబ్బలక్ష్మి, బుచ్చిబాబు వారసుడు ద్రోణంరాజు సుబ్బారావుతోపాటు మండలి బుద్ధప్రసాద్, కె.విజయ భాస్కర్ పాల్గొంటారు. వక్తలు: ఓల్గా, శీలా వీర్రాజు, వేదగిరి రాంబాబు, వాడ్రేవు చినవీరభద్రుడు, మృణాళిని, మునిపల్లె రాజు, కాత్యాయని విద్మహే, మన్నం రాయుడు, అంపశయ్య నవీన్. నిర్వహణ: తంగిరాల సుబ్బారావు.

 
 శ్రీశ్రీ వర్ధంతి సభ
 మొజాయిక్ సాహిత్య సంస్థ, సహృదయ సాహితీ సంస్థల ఆధ్వర్యంలో జూన్ 15న సాయంత్రం 6 గంటలకు విశాఖ పౌర గ్రంథాలయం ఏసీ హాల్‌లో శ్రీశ్రీ వర్ధంతి సభ జరగనుంది. ముఖ్య అతిథి: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఎల్.ఆర్.స్వామి, శేఖరమంత్రి ప్రభాకరరావు, అబ్దుల్ వాహెద్, రామతీర్థ పాల్గొంటారు.

 
 అవిశ్వాసం ఆవిష్కరణ
 ‘చెలిమి’ ఆధ్వర్యంలో, మెట్టు మురళీధర్ కథాసంపుటి అవిశ్వాసం ఆవిష్కరణ జూన్ 19న సాయంత్రం 5:30కు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాలులో జరగనుంది. ఆవిష్కర్త: జయధీర్ తిరుమలరావు. వక్త: కాత్యాయని విద్మహే.

 
 జయమ్ ఆవిష్కరణ సభ
 ‘మహాభారతమ్ మూలకథకు నవలారూపం’ అయిన నాయుని కృష్ణమూర్తి 426 పేజీల రచన జయమ్ ఆవిష్కరణ సభ జూన్ 19న ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లా చౌడేపల్లిలోని విజయవాణి రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో జరగనుంది. వివరాలకు: 9440995010

 
 ర్యాలి ప్రసాద్‌కు అజంతా, మో పురస్కారాలు
 2016 అజంతా, మో పురస్కారాలకుగానూ ర్యాలి ప్రసాద్ కవితా సంకలనాలు ‘ఆల్ఫా ఒమెగా’, ‘ఒక రాస్తాను’ ఎంపికైనట్టు గీతమ్ లిటరరీ ఫౌండేషన్ కార్యదర్శి డి.ఎస్.శేఖర్ తెలియజేస్తున్నారు. పురస్కారాల ప్రదానం పిఠాపురంలో జరగనుంది.

 
 చందాల కేశవదాసు 140వ జయంతి సభ
 తెరవే, జంట జిల్లాల శాఖ ఆధ్వర్యంలో- తొలి సినీకవి, నాటక రచయిత చందాల కేశవదాసు 140వ జయంతి సభ జూన్ 20న సాయంత్రం 5:30కు తెలంగాణ సారస్వత పరిషత్, బొగ్గులకుంట, హైదరాబాద్‌లో జరగనుంది. ప్రధాన వక్తలు: ఎం.పురుషోత్తమాచార్యులు, ఎన్.తిర్మల్, హెచ్.రమేశ్‌బాబు, లెనిన్ శ్రీనివాస్. జయధీర్ తిరుమలరావు, సి.నారాయణరెడ్డి, జూలూరు గౌరీశంకర్, తెలిదేవర భానుమూర్తి పాల్గొంటారు.
 
 

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా