చెరువు నిండితేనే...

28 Nov, 2014 00:17 IST|Sakshi
అలీమా మౌజా

చెరువులు నిండుగుంటేనే ప్రజలు చల్లగుం టారు. రామప్ప చెరువుకు ఎగువనున్న మా మౌజా నర్సాపురం ప్రాంతం ఒకప్పుడు వరికి చిరునామా. మా ఊరి ఇంచెం చెరువు, బొల్లం చెరువులుసహా పలు ఇతర చెరువులు, కుంటలు వర్షాలకు నిండి, రామప్ప చెరువును నింపేవి. దశాబ్దాల తరబడి పాలకులు నిర్లక్ష్యం చేయడంతో గంగాళాల్లాంటి మా ఊరి చెరు వులు తాంబాళాల్లా మారాయి. ఇంచెం చెరువు నీరు మా గ్రామా న్నే గాక ఎనిమిది గ్రామాలను సస్యశ్యామలం చేసేది. దానికి గొలు సుకట్టు చెరువులుగా దిగువనున్న బొల్లం చెరువు, పచ్చా ర్లకుంట, పడాల మల్లయ్యకుంట, సింగరకుంట, పటేటి కుంటలు నిండి బారాన వంతు రామప్ప చెరువును నింపేవి. పచ్చని చేలతో ఒకప్పుడు పచ్చగా ఉన్న బతుకులు నేడు చీకటిగా మారాయి. మా ప్రాంత ప్రజలు వలసపోతున్నారు. కేసీఆర్ చెరువుల పునరుద్ధ రణ కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. మా ఊరి చెరువులుసహా దిగువ నున్న గొలుగు చెరువులన్నిటి నీ తక్షణమే పునరుద్ధరించాలి. అప్పుడే రైతుల గాములు, గాజెలు, బాల సంతుల జోలెలు నిండుతాయి. తెలంగాణ జానపదం వర్ధిల్లుతుంది.
 అలీమా  మౌజా నర్సాపురం, వరంగల్ జిల్లా
 

>
మరిన్ని వార్తలు