అయోధ్యలో ఉద్రిక్తత.. 144 సెక్షన్‌ అమలు!

24 Nov, 2018 10:56 IST|Sakshi

నేడు అయోధ్యకు విశ్వహిందూ పరిషత్‌, శివసేన

సేనలతో రామజన్మకి ఉద్దవ్‌ ఠాక్రే

అయోధ్యను మోహరించిన పోలీసులు

లక్నో : అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోరుతూ విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), శివసేన చేపట్టిన ధర్మసభ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. దాదాపు 30 వేల మంది కరసేవకులతో పాటు శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ఠాక్రే శనివారం అయోధ్య చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగగకుండా అక్కడి పరిసరాలల్లో పోలీస్‌శాఖ 144 సెక్షన్‌లు అమలుచేసింది. రామజన్మ భూమిని సందర్శించేందుకు ఇప్పటికే 25000 మంది శివసేన కార్యకర్తలు అయోధ్య రైల్వే జంక్షన్‌కు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీస్‌శాఖ ముందస్తూ చర్యలును చేపట్టి.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది.

శివసేన ర్యాలీ సందర్భంగా అయోధ్యలో ఆర్మీ దళాలను దింపాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ శుక్రవారం సుప్రీంకోర్టును కోరారు. అయోధ్యలో ఉద్రిక్తమైన వాతావరణాన్ని బీజేపీ కోరుకుంటుందని.. సుప్రీం తీర్పులపై  వారికి నమ్మకం లేదని ఆయన అన్నారు.  కాగా రామాలయ నిర్మాణం కొరకు పార్లమెంట్ ద్వారా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని శివసేన డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీతో సహా, హిందుత్వ పార్టీలు రామజపాన్ని అందుకున్నాయి. పార్లమెంట్‌ ఆర్డినెన్స్‌తో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రామాలయ నిర్మాణం చేపడతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇటీవల ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య వివాదంను సుప్రీం ధర్మాసనం విచారించనున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు