రాహుల్‌ హిందువునని చెప్పుకోగలడా? : స్వామి

28 Sep, 2017 16:23 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హిందువా? లేక క్రైస్తవుడా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి ప్రశ్నిస్తున్నారు. గుజరాత్‌ పర్యటనలో రాహుల్‌ ప్రముఖ దేవాలయాలను సందర్శించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విలేకరులతో మాట్లాడిన స్వామి రాహుల్‌పై విమర్శలు చేశారు.

‘రాజ్‌పథ్‌లోని చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తాడు. ఇప్పుడేమో ఇలా దేవాలయాలకు వెళ్తున్నాడు. తానోక హిందువునని ప్రకటించుకునే దమ్ము రాహుల్‌కు ఉందా? అని స్వామి ప్రశ్నించారు. రాహుల్‌ ఎప్పటి నుంచో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నాడని ఆయన అన్నారు. తన తండ్రి రాజీవ్‌లాగే తాను కూడా ఓ హిందువునని రాహుల్‌ చెప్పాల్సిందేనని.. అప్పటిదాకా అతన్ని నమ్మలేమని స్వామి పేర్కొన్నారు. 

కాగా, గుజరాత్‌ ఎన్నికలు దగ్గర పడుతుండంతో రాహుల్‌గాంధీ మూడు రోజులపాటు గుజరాత్‌తో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ద్వారకా గుడి నుంచి మొదలుపెట్టి.. చోటిలా దేవాలయంలో పూజతో రాహుల్‌ తన పర్యటనను ముగించారు. దీంతో ఆయన(రాహుల్‌) చేసిన పని హిందుత్వ వాదులకు(బీజేపీ, ఆరెస్సెస్‌)లకు చెంపపెట్టని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించగా, స్వామి కౌంటర్‌ వేశారు.

మరిన్ని వార్తలు