కర్ణాటకం : గవర్నర్‌ను కలవనున్న యడ్యూరప్ప

10 Jul, 2019 14:04 IST|Sakshi

బెంగళూర్‌ : కర్ణాటక రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెబెల్స్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్‌ చిట్టచివరి ప్రయత్నాలు ముమ్మరం చేయగా, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోవైపు బీజేపీ కర్ణాటక చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప మరికాసేపట్లో గవర్నర్‌తో సమావేశం కానున్నారు.

కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ మైనారిటీలో పడిందని, తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా సీఎం కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక రెబెల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీ శిబిరానికి చేర్చేందుకు ఆ పార్టీ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ ముంబైలో ఎమ్మెల్యేలు బసచేసిన హోటల్‌కు చేరుకున్నారు.

కాగా తమను ప్రలోభపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసంతృప్త ఎమ్మెల్యేలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని ఎవరూ కలిసేందుకు పోలీసులు అనుమతించడం లేదు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన లేఖపై ఎమ్మెల్యేలు శివరామ్‌ హెబ్బర్‌, ప్రతాప్‌ గౌడ పాటిల్‌, బీసీ పాటిల్‌, సోమశేఖర్‌, రమేష్‌ జర్కిహొలి, బసవ్‌రాజ్‌, గోపాలయ్య, విశ్వనాధ్‌, నారాయణ్‌ గౌడ, మహేష్‌ కుముతలి ఉన్నారు.

మరిన్ని వార్తలు