మమత సర్కార్‌పై కేంద్రం ఆగ్రహం

7 May, 2020 15:24 IST|Sakshi

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి మధ్య కరోనా కాలంలోనూ కోల్డ్‌ వార్‌ సాగుతోంది. కరోనా వైరస్‌ కేసుల సంఖ్య విషయంలో ఇప్పటికే ఇరు ప్రభుత్వాలు మాటల యుద్ధానికి దిగగా.. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై కేంద్రం ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సరిహద్దు దేశం బంగ్లాదేశ్‌ నుంచి సరుకు రవాణకు కేంద్రం ఇటీవల అనుమతినిచ్చింది. అయితే దీనికి స్థానిక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విముకత వ్యక్తం చేసింది. తమ రాష్ట్రం నుంచి వాహనాలను పోనిచ్చేది లేదంటూ మమత తేల్చి చెప్పారు. దీంతో గత మూడు రోజులుగా సరుకు రవాణా నిలిచిపోయింది. (‌మద్యం ఇక హోం డెలివరీ..!)

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే వాహనాలు అడ్డుకోవడం సరైనది కాదని తెలిపారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో పాటు నేపాల్‌, భూటాన్‌ దేశాల నుంచి వచ్చే సరుకు వాహనాలకు అనుమతించాలని కోరారు. కాగా కరోనా కేసులపై ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్‌ బులిటెన్‌లోని కేసుల సంఖ్యకు, కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్న సంఖ్యకు పొంతన లేదంటూ ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరణాల రేటు ఎక్కువగా ఉండటాన్ని బట్టి, రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. (31 మందికి పోలీసులకు కరోనా పాజిటివ్‌)

మరిన్ని వార్తలు