ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం

8 Dec, 2017 01:40 IST|Sakshi

చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌

సాక్షి, హైదరా బాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల ఫీజు నియంత్రణలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ప్రతీ విద్యా సంవత్సరం ముందు ఫీజుల తగ్గింపుపై విద్యాశాఖ చేసే కసరత్తు ఓ తంతులా మారిందని ఆయనన ఓ ప్రకటనలో విమర్శించారు. ఈ విద్యా సంస్థల్ని నియంత్రించకుండా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మధ్యతరగతి విద్యార్థులు చదువులు మానేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. మరోవైపు కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతు న్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు