మూడో రోజూ గవర్నర్‌ ఇంటిముందే కేజ్రివాల్‌..

13 Jun, 2018 11:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరోస్తోందంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇంటి వద్ద సోమవారం సాయంత్రం ధర్నాకు  దిగిన ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌.. మూడో రోజు కూడా ధర్నాను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరించే వరకు ధర్నా ఆపేది లేదని బీష్మీంచుకొని కూర్చున్నారు. ప్రజలకు రేషన్‌ సరకులను డోర్‌డెలవరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్‌ అధికారుపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. 

కాగా తమ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రజలకు ట్విటర్‌లో వీడియోల ద్వారా చేరవేస్తున్నారు. ఢిల్లీ ప్రజల హక్కులను కేంద్రం హరిస్తుందని మండిపడ్డారు. తాము 24 గంటలుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇంట్లో బైఠాయించినా.. తమతో మాట్లాడేందుకు ఆయన చొరవ చూపడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల ఆత్మ గౌరవం కోసం తాము పోరాటం చేస్తున్నామని వెల్లడించారు.

మరో వైపు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటికే ఢిల్లీ వైద్య ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ మంగళవారం ఉదయం నిరవధిక నిరాహార దీక్షకు దిగగా, బుధవారం మరో నేత మనీష్‌ సిసోడియా కూడా నిరాహార దీక్ష చేపట్టారు.  

మరిన్ని వార్తలు