మొదటి ముద్దాయి చంద్రబాబు: జీవీఎల్‌

21 Jan, 2020 12:50 IST|Sakshi

టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా?

అభివృద్ధి వికేంద్రీకరణ మా సిద్ధాంతం: కన్నా

న్యూఢిల్లీ: రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు మరోసారి స్పష్టం చేశారు. శివరామకృష్ణన్‌ కమిటీ వద్దని చెప్పినా గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మంగళవారం జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి విషయంలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. నాడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేశామని.. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేతలు అంటున్నారని దుయ్యబట్టారు. తాము పెద్దన్నగా వ్యవహరిస్తే 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైకోర్టు ఏర్పాటుకు తాము పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. 

మొదటి ముద్దాయి చంద్రబాబు
‘రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఆదేశించాలి. అమరావతిలో నాలుగేళ్లలో నాలుగు బిల్డింగులు కూడా కట్టని చంద్రబాబు చేతగాని వ్యక్తి. చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం. అందువల్లే అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయలేదు. అమరావతిలో మొదటి ముద్దాయి చంద్రబాబు. అమరావతి పేరుతో సేకరించిన నిధులు స్వాహా చేశారు. అమరావతిలో వేల కోట్లు దుర్వినియోగం చేశారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు తీరును జీవీఎల్‌ ఎండగట్టారు. కాగా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు జీవీఎల్‌ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.(3 రాజధానులు: జీవీఎల్‌ కీలక వ్యాఖ్యలు)

అభివృద్ధి వికేంద్రీకరణ మా సిద్ధాంతం..
అభివృద్ధి వికేంద్రీకరణ తమ సిద్ధాంతమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే తమ మొదటి ప్రాధన్యత అని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. అమరావతిని చంద్రబాబు రియల్ ఎస్టేట్‌కు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. జనసేనతో కలిసి తాము పోరాటం చేస్తామని... రాజధాని నిర్మాణానికి అదనంగా సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి

సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం

అమరావతి దుస్థితికి బాబే కారకుడు!

మరిన్ని వార్తలు