రాష్ట్రానికి కేసీఆర్‌ దేవుడి బహుమతి

21 Dec, 2018 02:01 IST|Sakshi
సచివాలయంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహమూద్‌ అలీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ గాడ్‌ గిఫ్ట్‌ అని, దేశంలోనే ఆయనంతటి నాయకుడు లేరని హోంమంత్రి మహమూద్‌ అలీ కొనియాడారు. గతంలో తనకు డిప్యూటీ సీఎంగా, ఇప్పుడు హోంమంత్రిగా అవకాశం క ల్పించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. గురువా రం సచివాలయంలోని ఆయన చాంబర్‌లో హోంమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఏ ర్పాటు సమయంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించారని, అయన చేసిన ఆరోపణలను సీఎం కేసీఆర్‌ తిప్పికొట్టేలా పనిచేస్తున్నారని చెప్పారు.

దేశంలోనే టాప్‌ 
శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీస్‌శాఖ టాప్‌లో ఉందని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు అనేక సార్లు కితాబునిచ్చినట్టు మహమూద్‌ అలీ వెల్లడించారు. అలాగే అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేని విధంగా మైనారిటీల సంక్షేమంపై కేసీఆర్‌ దృష్టి పెట్టి అమలుచేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కే అధికారం అప్పగించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా బడ్జెట్లో రూ.2 వేల కోట్లు మైనారిటీ కోసం కేటాయిస్తున్నది కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు.

మంచి పేరు తెచ్చుకుంటా.. 
సీఎం కేసీఆర్‌ అప్పగించిన హోంమంత్రి పదవీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకుంటానని మహమూద్‌ అలీ అన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని, క్రైమ్‌ రేట్‌ ఇంకా తగ్గించాల్సిన అవసరముందన్నారు. అలాగే పోలీస్‌ సిబ్బందికి వారాంతపు సెలవుల అంశంపై డీజీపీ మహేందర్‌రెడ్డితో చర్చిస్తానని తెలిపారు. పదవీ బాధ్యతలు చేపట్టిన సంద ర్భంగా మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మహమూద్‌ అలీకి అభినందనలు తెలిపారు. అలాగే డీజీపీ మహేందర్‌రెడ్డి, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డీజీ తేజ్‌దీప్‌కౌర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, ఫైర్‌ విభాగం డీజీ గోపీకృష్ణ, సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్, పీసీఎస్‌ అదనపు డీజీపీ రవిగుప్తా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ బి.మల్లారెడ్డి తదితరులు హోంమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  
 

మరిన్ని వార్తలు