ముగిసిన ప్రచారం.. 21 పోలింగ్‌

19 Oct, 2019 17:21 IST|Sakshi

సాక్షి, హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లో గత కొన్ని రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. ప్రచార రథాలు నిలిచిపోయాయి. శనివారం సాయంత్రంతో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ అక్టోబర్‌ 21న జరుగుతుంది. అక్టోబర్‌ 24న ఫలితాలు వెలువడుతాయి. హుజూర్‌నగర్‌తో పాతో దేశవ్యాప్తంగా 51 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక పోలింగ్‌ నేపథ్యంలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో భద్రతను పెంచినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అభ్యర్థులపై ఎన్నికల సంఘం గట్టి నిఘా ఉంచింది. నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో వాహన తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిఘా పెంచారు. లైసెన్స్డ్‌ వెపన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు..
మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. మహారాష్ట్రాలోని 288 అసెంబ్లీ స్థానాలకు, హరియాణాలో 90 స్థానాలకు అక్టోబర్‌ 21 న పోలింగ్‌ జరుగనుంది. అక్టోబర్‌ 24 న ఫలితాలు వెల్లడిస్తారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా