ప్రచారం మరింత పెంచండి

28 Oct, 2018 02:27 IST|Sakshi

పట్టణాల్లో విస్తృతం చేయండి.. అభ్యర్థులకు కేసీఆర్‌ సూచన    

డీఎస్‌పై వేచిచూసే ధోరణిలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యర్థి పార్టీలతో సంబంధం లేకుండా ప్రచారాన్ని పెంచాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆ పార్టీ అభ్యర్థులను సూచించారు. ప్రతి రోజు కచ్చితంగా ప్రచారం నిర్వహించాలని, నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా ప్రచారం చేయాలని చెప్పారు. పలువురు అభ్యర్థులు నియోజకవర్గాల్లో కాకుండా హైదరాబాద్‌లోనే ఉంటుండటంపై కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. వారికి స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడారు.

‘ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లను కలి సేందుకే మనం ముందుగా అభ్యర్థులను ప్రకటిం చనున్నాం. ఈ సమయం చాలా కీలకమైనది. గ్రామాలు, బస్తీల్లో వీలైనంత వరకు ప్రతీ ఓటర్‌ను కలిసేలా ప్రణాళిక రూపొందించుకోండి. ఒక్కరోజు కూడా వృథా చేసుకోవద్దు. నగరాలు, పట్టణ ప్రాం తాల్లో ఎక్కువ మందిని కలవడం కష్టమైన ప్రక్రియ. ప్రజలు ఇళ్లలో ఉండే సమయానికి అనుగుణంగా ప్రచారం నిర్వహిం చాలి’ అని అన్నారు. టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం నుంచి పిలిస్తే తప్ప ఎవరూ ప్రచారానికి విరామం ఇవ్వవద్దని స్పష్టం చేశారు.

డీఎస్‌పై ఏం చేద్దాం...
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ వ్యవహారంపై ఆచి తూచి వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావి స్తోంది. డీఎస్‌ శనివారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ని కలిశారు. సాంకేతికంగా పార్టీలో చేరినట్లు లేకపోవడంతో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది.

కాంగ్రెస్‌లో చేరినట్లు అధికారికంగా స్పష్టత వస్తేనే రాజ్య సభ సభ్యత్వం రద్దుపై ఫిర్యాదు చేయవచ్చని, అప్ప టి వరకు వేచి చూడటమే మంచిదని భావిస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే రాజ్య సభ సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉండకుండా పోతుందని యోచిస్తోం ది. ఇక ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరిన అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు