కరువుతో అల్లాడుతున్నా సీఎం పట్టించుకోరా?

3 Apr, 2018 02:16 IST|Sakshi

బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: గత వానాకాలంలో తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతా ల్లో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయి సాగు, తాగు నీళ్లు లేక చాలా ఊళ్లు అల్లాడుతున్నా సీఎం కేసీఆర్‌ ఏమీ పట్టనట్టువ్యవహరిస్తున్నారని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. కరువును ముందుగానే అంచ నా చేసుకుని నీటి కష్టాల్లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిపోయి నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.

ప్రస్తుతం 100 మండలాల్లో కరువు నెలకొని ఉన్నా రక్షిత నీటి ప్రాజెక్టులకు రూ.లక్షలు కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేకపోవటం దారుణమన్నారు. 12 జిల్లాల్లో రుణాలను రీషెడ్యూల్‌ చేసుకున్న రైతులకు రుణమాఫీ అమలు కావటం లేదని, దీనిపై త్వరలోనే తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులతో భేటీ అవుతామన్నారు. కరువును అంచనా వేసేందుకు బీజేపీ కిసాన్‌ మోర్చా నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారని, వారి ద్వారా అందిన వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు