‘చంద్రబాబును చూసి సిగ్గుతో చచ్చిపోతున్నాం’

7 Mar, 2019 11:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు తమ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడంతో ఆయన స్పందించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... తప్పు ఒప్పుకుని తెలుగుజాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసుపై త్వరితగతిన నిష్పక్షపాత విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మనీ, మీడియా, మానిపులేషన్‌లతో చంద్రబాబు మోసాలు చేస్తున్నారని మండిపడ్డారు.  (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!)

‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలంటే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. భారత దేశ చరిత్రలో ఇంత నిసిగ్గుగా డబ్బులతో ఎదుటివారిని కొనేసి రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. నిజంగా చంద్రబాబుకు సిగ్గుండాలా. నాలుగేళ్ల క్రితం ఓటు కోట్లు కేసులో టీడీపీ నాయకులు ఆడియో, వీడియో టేపుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన వైనాన్ని దేశం యావత్తు చూసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రలోభాలకు దిగడంతో ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకున్నారు. (సార్‌ ఎవరు?)

ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఫలానా నాయకుడు మా ముఖ్యమంత్రి అని గర్వంగా చెప్పుకునేట్టు ఉండాలి. మీ సీఎం ఎవరని అడిగితే చంద్రబాబు అని చెప్పటానికి సిగ్గుపడే పరిస్థితులు ఇవాళ కన్పిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్‌ రిపోర్టులు వచ్చాయి. తప్పు ఒప్పుకుని తెలుగు జాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. కోర్టులను అడ్డం పెట్టుకుని స్టేలు తెచ్చుకుని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును విచారణను వేగవంతం చేయాలి. చంద్రబాబు పట్ల కేసీఆర్‌ ఉదారంగా వ్యహరించడం సరికాదు. చట్టబద్ధంగా నిష్పక్షపాత దర్యాప్తు జరిపాల’ని అప్పిరెడ్డి అన్నారు. (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?)

మరిన్ని వార్తలు