చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం 

11 Jun, 2018 16:08 IST|Sakshi
ఎమ్మెల్యే సాయి సమక్షంలో పార్టీలో చేరిన గోనబావి గ్రామ టీడీపీ  నాయకులు, కార్యకర్తలు

ఎమ్మెల్యే సాయి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన టీడీపీ నాయకులు

ఆదోని టౌన్‌ : అవినీతి అక్రమాల కేసుల్లో సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. తనకు ఏదైనా జరిగితే ప్రజలు వలయంగా నిలుస్తారని, రాష్ట్రం అగ్నిగుండం అవుతుందంటున్న బాబు మాటలు వింటుంటే జైలుకు వెళ్లడం తథ్యమనే విషయం అర్థమవుతుందని చెప్పారు. ఆదివారం ఆదోని మండలం గోనబావి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.  ఆ గ్రామానికి చెందిన  టీడీపీ మాజీ నాయకులు ఈరన్న, గోవిందు ఆధ్వర్యంలో   అన్వర్‌తో పాటు లక్ష్మన్న, ఈరన్న, రంగన్న, చిన్న నర్సన్న, పెద్ద ఉసేని, బసప్ప తదితరులు పార్టీ తీర్థం పుచుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి మాట్లాడుతూ ఎవరికీ భయపాడాల్సిన అవసరం లేదని, అండగా తామున్నామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తూ పేదల పార్టీగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  ప్రవేశపెట్టిన పథకాలు పేదల బతుకుల్లో వెలుగులు నింపడంతో నేటికీ ఆయనను స్మరించుకుంటున్నారని గుర్తు చేశారు.  దోచుకో... దాచుకో నినాదంతో టీడీపీ నాయకులు ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు ద్వారా కోట్లాది రూపాయలు దాచుకున్న ఘనత టీడీపీ నేతలకే దక్కుతోందని విమర్శించారు.

పేదలను పరామర్శించిన ఎమ్మెల్యే సాయి

గుడిసెల్లోకి వరద నీరు చేరడంతో రాత్రంతా జాగారణ చేసిన పేదలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే  పరామర్శించారు.  వర్షం మూలంగా నిత్యావసర సరుకులు తడిసిపోవడంతో ఎనిమిది కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేశారు.  వైఎస్‌ఆర్‌సీపీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  2019లో సీఎం అవుతారని, పేదల కష్టాలన్నీ తొలగి పోతాయని భరోసా ఇచ్చారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా