370 రద్దుపై ఎన్‌సీ సవాల్‌

11 Aug, 2019 04:39 IST|Sakshi

కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ అమలును ఆపాలని సుప్రీంలో పిటిషన్‌

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ఉన్న రాజ్యాంగబద్ధ హోదాను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయా న్ని సవాల్‌ చేస్తూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పౌరుల సమ్మతి లేకుండానే వారి హక్కులను కేంద్రం లాగేసుకుందని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌ పునర్వ్య వస్థీకరణకు సంబంధించిన చట్టం అమలు కాకుండా చూడాలని ఎన్‌సీకి చెందిన ఎంపీలు మహమ్మద్‌ అక్బర్‌ లోనె, హస్నైన్‌ మసూదీ తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్‌ శాశ్వతమైంది.

కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2019, రాష్ట్రపతి ఉత్తర్వుల ఫలితంగా ఆర్టికల్‌ 370, 35ఏ  రద్దయ్యాయి. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ జించి ప్రజల హక్కులను కాలరాశారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు రాజ్యాంగవిరుద్ధం. భారత సమాఖ్య వ్య వస్థ, ప్రజాస్వామ్యం, చట్ట పాలనకు సంరక్షకుడిగా ఉన్న సుప్రీంకోర్టు ఈ విషయమై స్పందించాలి. ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాలను అమలు కాకుండా రద్దు చేయాలి’ అని కోరారు.

మీడియాపై ఆంక్షలను ఎత్తివేయాలి
జమ్మూకశ్మీర్‌లో మీడియాపై కొనసాగుతున్న ఆం క్షలను ఎత్తివేయాలంటూ కశ్మీర్‌ టైమ్స్‌ పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అనురాధా భాసిన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆగస్టు 4వ తేదీ నుంచి కొనసాగుతున్న నియంత్రణల కారణంగా కశ్మీర్‌తో పాటు జమ్మూలోని కొన్ని జిల్లాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు