2022 నాటికి పీవోకే భారత్‌దే

12 Sep, 2019 11:55 IST|Sakshi

శివసేన నేత సంచలన వ్యాఖ్యలు

ముంబై: ‘2022నాటికి పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) భారత్‌లో కలిసిపోతుంది. జమ్మూ‍కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇక త్వరలోనే పీవోకే కూడా భారత్‌ స్వాధీనం చేసుకుంటుంద’ని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుకు శివసేన సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. సంజయ్‌ రౌత్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు.

‘కశ్మీర్‌ మా అంతర్గత అంశమని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు విస్పష్టంగా చెప్పారు. ఇమ్రాన్‌ ఖాన్‌ (పాక్‌ పీఎం) బాడీ లాగ్వెంజ్‌ చూడండి. కశ్మీర్‌ పూర్తిగా భారత్‌ నియంత్రణలోకి వచ్చేసింది. ఆర్టికల్‌ 370ను రద్దు చేశారు. త్వరలో పీవోకే కూడా భారత్‌లో అంతర్భాగమవుతుంది. 2022నాటికి అఖండ భారత స్వప్నం సాకారమవుతుంది’ అని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో పీవోకేను కూడా భారత్‌లో అంతర్భాగంలో చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సంజయ్‌ ఈ మేరకు కామెంట్‌ చేశారు.

సంజయ్‌ రౌత్‌

మరిన్ని వార్తలు