Pakistan Occupied Kashmir: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది

12 Sep, 2023 12:36 IST|Sakshi

జైపూర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలిసిపోతుంది.. కాకపోతే దాని కోసం కొంత కాలం వేచి ఉండాలన్నారు కేంద్ర మంత్రి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్. 

పరివర్తన సంకల్ప యాత్రలో భాగంగా దౌసాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి వీకే సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని షియా ముస్లింలు సరిహద్దు గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారని చూస్తూ ఉండండి ఎదో ఒక రోజు ఆ భూభగం దానంతటదే వచ్చి భారత్‌లో కలిసిపోతుందన్నారు. 

ఈ సందర్బంగా జీ20 సమావేశాలు విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రసశంసలు కురిపించిన ఆయన గతంలో ఇవే సమావేశాలు చాలా దేశాలు నిర్వహించినప్పటికీ భారత్ మరింత ఘనంగా నిర్వహించిందని ప్రపంచ వేదిక మీద భారత్ సత్తా ఏమిటో నిరూపించుకుందని అన్నారు. 

ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని అందుకే బీజేపీ ప్రతిష్టాత్మక పరివర్తన యాత్రను ప్రారంభించిందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని యాత్ర సమయంలో వారే స్వయంగా వచ్చి ఆ విషయాన్ని తెలిపారన్నారు. బీజేపీ ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదని ప్రధాని ఛరిష్మాతోనే ఎన్నికలకు వెళ్తుందని అన్నారు. మంచితనంతో ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజలు కోరుకునే అభ్యర్థులకు పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. 

ఇది కూడా చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ

మరిన్ని వార్తలు