15 లక్షల ప్రామిస్‌పై బదులిచ్చారు

24 Apr, 2018 08:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ ; గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను ప్రజలెవరూ మరిచిపోలేదు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనానంత వెనక్కి తెప్పించి.. ప్రతీ పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయిస్తానని మోదీ నాటి ఎన్నికల ప్రచారంలో ప్రామిస్‌ చేశారు. అయితే దీనిపై ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరణ అడిగ్గా.. ప్రధాని కార్యాలయం ఇప్పుడు స్పందించింది. 

ఆర్టీఐ చట్టాన్ని అనుసరించి ఇది అసలు ‘సమాచారం’ కిందే రాదంటూ ఆ దరఖాస్తును తిరస్కరించింది. నవంబర్‌ 26, 2016న(అంటే మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన 18 రోజుల తర్వాత) మోహన్‌ కుమార్‌ శర్మ అనే వ్యక్తి ప్రధాని కార్యాలయానికి.. ఆర్బీఐకు ఆర్టీఐ కింద లేఖలు రాశారు. ‘రూ.15 లక్షలు జమ చేయిస్తానని మోదీ చెప్పారు. అది ఎంత వరకు వచ్చింది? అని ఆయన వివరణ కోరారు. అయితే దానికి పీఎంవో ఆఫీస్‌ ఇప్పుడు స్పందించింది. ఆర్టీఐ చట్టం సెక్షన్‌-2(ఎఫ్‌) ప్రకారం ఇదసలు సమాచారం కిందే రాదంటూ ప్రధాన కార్యాలయపు సమాచార కమిషనర్‌ ఆర్‌కే మథుర్‌ పేరిట అశోక్‌కు బదులు వచ్చింది. ఇక నోట్ల రద్దు నిర్ణయం కొన్ని ప్రింట్‌ మీడియాలకు ముందే ఎలా తెలిసిందంటూ అశోక్‌ మరో లేఖ రాయగా.. అది కూడా సమాచారం కింద రాదంటూ పీఎంవో ఆఫీస్‌ పేర్కొంది. 

సమాచార హక్కు చట్టం-2015 లోని సెక్షన్‌-2(ఎఫ్‌) ప్రకారం.. రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, నమూనాలు, తనిఖీ రికార్డులు సమాచారం కిందకు వర్తిస్థాయి . ఈ సమాచారం ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉండొచ్చు.

మరిన్ని వార్తలు