Advertisement

‘దాడులకు భయపడే బాబు తెలంగాణకు పారిపోయారు’

15 Feb, 2020 13:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి సారేపల్లి సుధీర్‌ కుమార్‌ విమర్శించారు. చుట్టగుంటలో పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు తన  పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌పై జరిగిన ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడిలో బయటపడ్డ అవినీతి సొమ్ము ఎక్కడిదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారని మాట్లాడిన అచ్చెం నాయుడు ఐటీ దాడులు అనేవి కేంద్రం పరిధిలో ఉంటాయన్న సంగతి కూడా తెలియకుండా ఎలా ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్‌ సీపీ 8 నెలల పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఇమేజ్‌ రోజు రోజుకు డ్యామేజ్‌ అవుతుందని విమర్శించారు. ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయని భయపడి బాబు తెలంగాణకు పారిపోయారని విమర్శించారు. టీడీపీ బినామీలను అదుపులోకి తెస్తే 10 సంవత్సరాల రాష్ట్ర బడ్జేట్‌ సొమ్ము బయటకు వస్తుందన్నారు. కేంద్రం స్పందించి ప్రజాధనాన్ని వెలికితీయాలని కోరారు. టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసిన సీఎం జగన్‌కు ప్రజాభిమానం తగ్గదని ఆయన స్పష్టం చేశారు.

అందుకే చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లింది.. 

చంద్రబాబు, లోకేశ్‌ పలకరేం!?

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'బాబును కాపాడాలనేదే పచ్చపత్రికల తాపత్రయం'

తిట్టుకున్న ‘తమ్ముళ్లు’

పలు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం

‘మన అదృష్టవశాత్తు అమరావతి నిర్మాణం జరగలేదు!’

ఇలా చేయడం తప్పు..

సినిమా

ఘనంగా హీరో నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌

‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ ఫస్ట్‌ డే కలెక్షన్‌ అదుర్స్‌.. కానీ!

చిరంజీవి తొలి సినిమా దర్శకుడు మృతి

స్టార్‌ హీరోయిన్‌తో ఐదేళ్ల ప్రేమాయణం..!

నటుడు ఉదయ్‌ కిరణ్‌ హఠాన్మరణం

‘అలా బతకడంలో తప్పు లేదు.. కానీ!’