క్షమాపణ లేకుండానే బెయిల్‌!

14 May, 2019 13:35 IST|Sakshi

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్ఫెడ్‌ ఫొటో సోషల్‌ మీడియాలో పోస్టు చేసినందుకు అరెస్టైన బీజేపీ యువమోర్చా నేత ప్రియాంక శర్మకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. మమతా బెనర్జీ మీమ్‌ పోస్టు చేసినందుకు క్షమాపణ చెప్పాలని మంగళవారం వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు బీజేపీ నేత ప్రియాంక శర్మను ఆదేశించింది. ఎన్నికల సమయం కావడం, పిటిషనర్‌ రాజకీయ పార్టీ కార్యకర్త కావడంతో ఈ సమయంలో క్రిమినల్‌ చర్యల అంశాన్ని ప్రస్తావించడం​లేదని, కానీ ఎన్నికల నేపథ్యంలో క్షమాపణ అర్థించడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. భావప్రకటనా స్వేచ్ఛ పేరిట ఒకరి వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీయడాన్ని తాము సహించబోమని, క్షమాపణ చెప్పాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఈ మేరకు వాదనల అనంతరం బెయిల్‌ మంజూరు చేసిన ధర్మాసనం.. అనంతరం ప్రియాంక శర్మ లాయర్‌ ఎన్‌కే కౌల్‌ను పిలిచి.. క్షమాపణ షరతను తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
బీజేపీ యువమోర్చా నేత ప్రియాంక శర్మకు బెయిల్‌ 

చదవండి: సీఎం మార్ఫింగ్‌ ఫొటో షేర్‌ చేసినందుకు...

మరిన్ని వార్తలు