ప్రభుత్వం వారిని మోసం చేస్తోంది...

21 Mar, 2018 19:07 IST|Sakshi
కె.లక్ష్మణ్‌

 సాక్షి​, హైదరాబాద్‌: రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు.ఆయన బుధవారం విలేకరులు సమావేశంలో మట్లాడుతూ... ‘తమ బాకీ తీర్చకుంటే దుబ్బాకలో రైతులపై చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు. సీఎం మాట నమ్మి రుణమాఫీ అవుతుందని రైతులు సంబరపడ్డారు. కానీ వారిని ప్రభుత్వం మోసం చేసింది.’ అని ఆరోపించారు. కేసీఆర్‌ సొంతూరుకు కూతవేటు దూరంలో ఉన్న రైతులే అరిగోస పడుతున్నారని.. ఇక రాష్ట్రంలో మిగతా రైతుల పరిస్థితేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

రైతు మేలు కోరని ప్రభుత్వం..
రైతులకు మేలు చేసే ఉద్దేశముంటే ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి... రాష్ట్రస్థాయి బ్యాంకర్స్‌ మీటింగ్‌ పెట్టి రైతుల రుణ సమస్యలు తీర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌, నల్గొండ, మెదక్‌ రైతులతో కలిసి బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 23న ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. 

రైతుబీమాపై లేని ధీమా..
‘రైతుబీమా’ పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. 40లక్షల రైతుల బీమాకు రూ.1200 కోట్లు అవసరం. కానీ రూ.500 కోట్లతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో ఎక్కడా నిరశనలు, దర్నాలు చేయకుండా అడ్డకుంటున్నకేసీఆర్‌.. ఆయన మాత్రం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దర్నా చేస్తాడట’ అని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికలపై తెలంగాణలో బీజేపీ స్టాండ్‌ ఏమిటన్నది రేపు వెల్లడిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు