సీఈసీ రజత్‌కుమార్‌ మాట ఇచ్చి తప్పారు : ఉత్తమ్‌

24 Jan, 2019 15:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎలక్షన్‌ కమిషన్‌పై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఫలితాలపై అనుమానాలున్న చోట వీవీ ప్యాట్లు లెక్కించారని గుర్తు చేశారు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని అన్నారు. కౌంటింగ్‌కు, పోలింగ్‌కు మధ్య భారీ తేడా ఉన్న కారణంగానే తాము వీవీ ప్యాట్లు లెక్కించాలని డిమాండ్‌ చేసినట్టు తెలిపారు. తమ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కచోట వీవీప్యాట్లు లెక్కించలేదని వాపోయారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఓట్ల సవరణ చేయకుండా ఈసీ ఎన్నికలు వెళ్లిందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను ‘ఫ్రీ అండ్‌ ఫేర్‌’గా నిర్వహించడంలో ఈసీ విఫలమైందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బ్యాలట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అలాగే, 10వేల మెజారిటీతో ఫలితం వెల్లడైన చోట వీవీప్యాట్లు లెక్కించాలని అన్నారు. ఓట్లను సవరిస్తామని హైకోర్టులో చెప్పిన సీఈసీ రజత్‌కుమార్‌ మాటతప్పారని విమర్శించారు.

మరిన్ని వార్తలు