టీఆర్‌ఎస్‌కు ఓటేయొద్దు 

19 Jan, 2020 02:07 IST|Sakshi

సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకమయితే అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు? 

ప్రభుత్వంపై ఒవైసీ ఎందుకు ఒత్తిడి తేవడం లేదు: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

 సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నార్సీ, సీఏఏలను వ్యతిరేకిస్తున్న వారంతా మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయొద్దని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. వీటి అమలు విషయంలో సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న మౌనం తప్పుడు సంకేతాలను పంపుతోందని, ఈ మౌనాన్ని వీడి ఎన్నార్సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ల పట్ల స్పష్టమైన వైఖరి ప్రకటించాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని శనివారం ఒక ప్రకటనలో ఆయన కోరారు. పార్లమెంటులో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌ తెలంగాణలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో కేసీఆర్‌కు రహస్య స్నేహం ఉన్నందునే అలా ప్రకటించేందుకు వెనుకాడుతున్నాడని ఆరోపించిన ఉత్తమ్, ఈ విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నిం చారు. మతపెద్దలను తీసుకుని ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో చర్చలు జరిపిన ఒవైసీ రెండు రోజుల్లో సీఎం ప్రకటన చేస్తారని చెప్పారని, మరి 25 రోజులు అయినా ఆ ప్రకటన ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీతో టీఆర్‌ఎస్‌కు రహస్య స్నేహం, ఎంఐఎంతో బహిరంగ స్నేహం ఉందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. 

కాంగ్రెస్‌తోనే న్యాయం..
చింతలపాలెం (హుజూర్‌నగర్‌): మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్‌ఎస్‌కు అంత ర్గత పొత్తు ఉందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీతో లోపాయికారి ఒప్పదం కుదుర్చుకుందన్నారు. మైనార్టీలకు, మిగతా వర్గాల వారికి మేలు జరగాలన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఈ ఎన్నికల్లో, సీపీఐ, సీపీఎం, టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ఉత్తమ్‌ తెలిపారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాబుకు ఆ వైర‌స్ సోకింది: మంత్రి

‘బాబు..  ఇక్కడికి వస్తే వాస్తవాలు తెలుస్తాయి ’

బాలయ్యా.. ఇదేందయ్యా!

లాక్‌డౌన్‌: ‘ప్రజలకు వైద్యంతోపాటు అవి కూడా ముఖ్యం’

14 ఏళ్లు సీఎంగా చేసిన అనుభవం ఇదేనా?

సినిమా

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు