‘వైఎస్సార్‌ గిరిజనుల గుండెల్లో ఉంటారు’

8 Mar, 2019 14:49 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాకు అటవీ భూములపై హక్కులు కల్పించారు. ఆయన ఎప్పటికి గిరిజనుల గుండెల్లో ఉంటార’ని వైఎస్సార్‌ సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 30 లక్షల గిరిజనులు అత్యంత పేదరికం, దుర్భరమైన జీవితం గడుపుతున్నారని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజనులను కించపరిచే వ్యాఖ్యలు చేశారని, ఆయన గిరిజనుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు గిరిజనులకి చేసింది ఏమీ లేదని చెప్పారు. తాము గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏం చేయాలో చర్చించామని, తమ పార్టీ మ్యానిఫెస్టో కమిటీకి అందజేస్తామని తెలిపారు. చంద్రబాబు గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఏడు ఎస్టీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

 ‘బాబుని గద్దె దించటమే మా లక్ష్యం’
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని గద్దె దించటమే తమ లక్ష్యమని  వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలో గిరిజనుల సమస్యల ప్రస్తావిస్తామని చెప్పారు. చంద్రబాబు పాలన నికృష్ట పాలనని, గిరిజనులు మరోసారి మోసపోరన్నారు. చివరివరకు ఒక్క గిరిజనుడికైనా మంత్రి పదవి ఇచ్చావా అని ప్రశ్నించారు. గిరిజన ఎమ్మెల్యే చనిపోతేగానీ ఇవ్వలేదంటూ మండిపడ్డారు. కిశోర్ చంద్రదేవ్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. బాక్సైట్‌ జీవో ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ట్రైబల్ ఎకానమీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, హెల్త్ ఈ 4 అంశాలు తమ మ్యానిఫెస్టోలో ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు.

మరిన్ని వార్తలు