వేటు వేయాల్సిందే

4 Mar, 2018 11:23 IST|Sakshi
విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకు వైఎస్సార్‌సీపీ డిమాండ్‌

సాక్షి, విజయవాడ: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు రెండోసారి విజ్ఞానపత్రం ఇచ్చామని వైఎస్సార్‌సీపీ నాయకులు వి. విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీరిరువురు విలేకరులతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. చింతమనేనికి కోర్టు రెండేళ్లకుపైగా జైలు శిక్ష విధించినందున ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా పేర్కొంటూ స్పీకర్ నోటిఫై చేయాల్సివుందన్నారు. దీనిపై గతంలో స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ వ్యవహరించాలని కోరామన్నారు.  

ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని పునరుద్ఘాటించారు. ముందుగా ప్రకటించినట్టుగానే ఏప్రిల్‌ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. అన్ని ఆలోచించే ఈ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు