కుల రాజకీయాలతో అమాయకుల బలి

14 Sep, 2019 12:43 IST|Sakshi
మాట్లాడుతున్న పెనుబాల నాగసుబ్బయ్య

సాక్షి, కడప(నందలూరు) : రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రాజంపేటలో కులరాజకీయాలు చేస్తూ అమాయకులను బలిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీసెల్‌ నేత పెనుబాల నాగసుబ్బయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బత్యాల గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి రాజంపేట నియోజకవర్గం ప్రశాంతత కోల్పోయిందన్నారు. ఈనెల 9న సోమవారం గువ్వల ఎల్లమ్మ పొలానికి సంబంధించి ప్రభుత్వం 1994లో 1158 సర్వేనెంబరులో 2.80 ఎకరాల సెంట్ల భూమికి సంబంధించి పాసుపుస్తుకాలు, వన్‌బీ ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఆమెకు ఆర్థికస్తొమత లేక రాజకీయ అండదండలు లేక ఆ భూమిని అభివృద్ధి చేసుకోలేకపోయారన్నారు. ఈ మధ్య కాలంలో ఎల్లమ్మ కుమారుడు ఓబులేసు అనే వ్యక్తి ఈ పొలంలో గది నిర్మించుకున్నాడన్నారు.

10వ తేదీన బత్యాల వర్గీయులు కొండా సురేష్, మరి కొంతమంది బుల్డోజర్‌ సాయంతో గదిని ధ్వంసం చేశారన్నారు. బాధితుడిపై మచ్చుకత్తితో దాడి చేశారన్నారు. తల్లీకొడుకును పొలంలో నుంచి బయటకి తరుముకుంటూ వచ్చారన్నారు. దీంతో బాధితుడు భయపడి తహసీల్దారు కార్యాలయం వద్దకు వెళ్లి వైఎస్సార్‌సీపీ నాయకులకు మొరపెట్టుకున్నారన్నారు. తనతో పాటు మండెంనాగరాజు, ధనుంజనాయుడు , కాకిచంద్ర, భాస్కర్, నాని , మధు యాదవ్‌లు ఉన్నారన్నారు. టీడీపీకి చెందిన నాయకులు ఈ సంఘటనపై విచారణ చేయకుండా కేవలం ఒక సామాజికవర్గానికి కొమ్ముకాస్తూ కులాలను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారన్నారు. 

మేడా కుటుంబీకులను విమర్శించే హక్కులేదు
ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తూ మేడా కుటుంబాన్ని విమర్శించే హక్కు బత్యాలకు లేదని నాగసుబ్బయ్య అన్నారు. మేడా కుటుంబం ఎంత అభివృద్ధి చేస్తుందో ప్రజలు చూస్తున్నారన్నారు. బత్యాల ఇప్పటికైనా ఫ్యాక్షన్‌ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ నాయకులు వేల్పుల శైలకుమార్, పణతల గంగయ్య, ధనుంజ నాయుడు, శివ, మధు, హిమగిరి, గుండు మల్లికారుజనరెడ్డి్డ, అరిగెల నాని, హిమగిరి, రాజశేఖర్‌రెడ్డి విజయుడు, కొరివి బలరాం, గుండు మల్లికార్జునరెడ్డి, మధు, మండెం నాగరాజు, «గుండు జనార్దన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు