‘రాష్ట్రంలో రావణ పాలన సాగుతోంది’

21 Jun, 2018 16:57 IST|Sakshi

సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో అడుగుడునా అవినీతి రాజ్యమేలుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా కుడేరులో ఆయన మహాధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రావణాసుర పాలన సాగుతోందని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రజల నెత్తిన రూ.2.30 లక్షల కోట్లు అప్పు మోపారని ఆరోపించారు. హంద్రీనీవా ద్వారా ఇప్పటి వరకూ జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీరందించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పేదలందరికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నేతల నిరసన
బీసీ జాబితాలోని వాల్మీకి, కురుబ, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, కుమ్మర కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నేతలు నిరసన తెలిపారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బీసీ జాబితలోని ఆ ఐదు కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు